కేసీఆర్ కోటలో రేవంత్ గర్జన.. వారికి వార్నింగ్

by Shyam |   ( Updated:2021-09-17 09:38:58.0  )
TPCC Chief Revanth Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి గర్జించారు. తన స్పీచ్‌తో టీఆర్‌ఎస్ నేతలను దుమ్ముదులిపేశారు. గజ్వేల్‌లో జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో రేవంత్ పాల్గొని పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ‘దమ్ముంటే గజ్వేల్‌కు రావాలని టీఆర్‌ఎస్ నేతలు సవాల్ విసిరారు. ఇసుకవేస్తే రాలనంత జనం గజ్వేల్ సభకు పోటెత్తారు.. ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులకు చెబుతున్నా.. మా తలకాయలు లెక్కపెట్టండి.. ఒక్క తల తక్కువ ఉన్నా.. మళ్లీ ఆరు నెలల్లో ఇదే గడ్డ మీద కదం తోక్కుతాం.. అప్పుడు 5 లక్షల మంది వస్తాం.. కేసీఆర్ గుర్తు పెట్టుకో’ అని రేవంత్ హెచ్చరించారు. ఇవాళ తెలంగాణ గడ్డకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని, స్వయంపాలన కోసం నాడు రజాకార్లను తరిమికొట్టారన్నారు.

గజ్వేల్ అంటే తనకు ప్రత్యేక అభిమానముందని రేవంత్ తెలిపారు. కొండపోచమ్మ ప్రాజెక్టు కింద 14 గ్రామాలను నట్టే ముంచారని, 14 గ్రామాల ప్రజలకు నిలువ నీడ లేకుండా చేశారని ఆరోపించారు. 1980లో మెదక్ నుంచే ఇందిరాగాంధీ గెలిచారని, ఇందిరాగాంధీ మెదక్ జిల్లాలో 25 పెద్దతరహా పరిశ్రమలు పెట్టించారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదేనని, రాష్ట్రం వచ్చాక కాంగ్రెస్ కు కేసీఆర్ వెన్నుపోటు పోడిచారని రేవంత్ విమర్శించారు.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్… ‘డ్రగ్స్ కేసులో కేటీఆర్‌కు లింకులు.. సెలబ్రెటీలతో సంబంధాలు’…..విచారణకు స్వీకరించిన ఈడీ

Advertisement

Next Story

Most Viewed