- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడుదాం
దిశ ప్రతినిధి, మెదక్: దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు తమతో కలిసి రావాలని తోట కమలాకర్ రెడ్డిని టీపీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కోరారు. బీజేపీ బహిష్కృత నేత తోట కమలాకర్ రెడ్డిని మిరుదొడ్డిలోని ఆయన స్వగృహంలో రేవంత్ రెడ్డి కలిశారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన కమలాకర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం బాధాకరమని తెలిపారు. తమ పార్టీలో ఆయన చేరితే నియోజకవర్గంలో బలమైన పార్టీగా కాంగ్రెస్ ఎదుగుతుందని అన్నారు. అందుకే కాంగ్రెస్ లోకి కమలాకర్ రెడ్డిని ఆహ్వానించామని అన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాల్సిన బీజేపీ తన సిద్ధాంతాలను మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. అత్యాచార అభియోగం ఎదుర్కొంటున్న రఘునందన్ రావుకు బీజేపీ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించిన కమలాకర్ రెడ్డిని ఆ పార్టీ సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్నారు. దుబ్బాక ఒక కన్ను , సిద్దిపేట మరో కన్ను అంటున్న హరీశ్ మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు.