- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవిత ఫొటోపై రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు
దిశ, తెలంగాణ బ్యూరో : నాలుగేండ్ల కిందట సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాలను అభివృద్ధి చేస్తామని పేదలను ఆశపెట్టాడని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం దత్తత గ్రామాల్లో ఏం అభివృద్ధి చేశారో చూపించాలని సవాల్ విసిరితే టీఆర్ఎస్ నేతలు పారిపోయారని, సీఎం ఇచ్చిన ఒక్క హామీని అమలు చేసినట్లైతే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తానని సవాల్ చేసినా ఒక్క టీఆర్ఎస్ నాయకుడు రాలేదన్నారు. ఇప్పటి వరకు బ్రోకర్లు.. జోకర్లును చూశామని, కానీ టీఆర్ఎస్ నేతలు బ్రోకర్లు, జోకర్లుగా మారారు.
మంత్రి మల్లారెడ్డి బ్రోకర్‌గా అవతారమెత్తాడు. భూములు అమ్మినా కొన్నా మల్లారెడ్డికి కమీషన్ఇవ్వాల్సిందేనని ఆరోపించారు. సూరారంలో చెరువును ఆక్రమించి, తూమును కూల్చి కాలేజీలు కట్టుకున్నాడని విమర్శించారు. మల్లారెడ్డి అల్లుడు ఔటర్‌రింగ్‌రోడ్డు పక్కన చెరువును మింగాడన్నారు. మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇంజినీరింగ్, వైద్య కాలేజీల్లో ప్రొఫెసర్లు లేరన్నారు. ఈ ప్రాంతంలో ఈ వివాదస్పద భూమిని చూసిన మల్లారెడ్డి బంధువులదేనన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీకి 25 ఎకరాల భూమి ఇచ్చాడో అదంతా దొంగ భూమి అని, దొంగ పత్రాలతో మల్లారెడ్డి యూనివర్సిటీ అనుమతి తెచ్చుకున్నాడని రేవంత్‌రెడ్డి అన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీ కింద తీసుకున్న భూమి అసైన్మెంట్భూమి అని, దానికి పాస్‌బుక్కులు సృష్టించారన్నారు.
మల్లారెడ్డి అవినీతిపై విచారణకు సిద్ధమా..?
ఆనాడు కేసీఆర్ ఇంటి పంచాయతీపై ఆరోపణలు చేసిన డిప్యూటీ సీఎం రాజయ్యను పదవి నుంచి తొలగించారని, కానీ ఇప్పుడు మల్లారెడ్డి 20 ఎకరాలకు తప్పుడు పత్రాలను సృష్టించి ట్రస్టుకు గిప్ట్ డీడీ పేరుతో అనుమతి ఇచ్చారని, దీనిపై విచారణకు ఆదేశించాలని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ప్రతి ఊరిలో ఇక నుంచి మల్లారెడ్డి అవినీతిపై దండోరా వేయిస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అడ్డు వస్తానని మల్లారెడ్డి అల్లుడు అన్నాడని, ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను అడ్డుకున్నా తొక్కి పెడ్తామని హెచ్చరించారు.
పోలీస్ స్టేషన్లలో దొంగల్లా ఉన్నారు
కేసీఆర్, కేటీఆర్, కవితారావు, కన్నారావుతో పాటు మల్లారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని, ఆ ఫొటోలను చూస్తే పోలీస్ స్టేషన్లలో దొంగల ఫొటోల మాదిరిగా కనిపించాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. దళితుల సమస్యలను లోతుగా తెలుసుకునేందుకే రచ్చబండ పెట్టానన్నారు.
Readmore