- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం… కరోనా మృతదేహం తారుమారు…
దిశ, వెబ్‌డెస్క్ : కరోనాతో ఆసుపత్రిలో చేరిన మహిళ మృతి చెందిదని ఆసుపత్రి సిబ్బంది కుటుంబీకులకు చెప్పడంతో కుటుంబీకులు ఖర్మకాండలు నిర్వహించారు. కొన్ని రోజుల తరువాత మృతి చెందిందని చెప్పిన మహిళ ఇంటికి రావడంతో కుటుంబీకులు అవాకయ్యారు. వివరాల్లోకి వెళితే… గత నెల మే12న కరోనాతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం జగ్గయ్యపేటకు చెందిన ముక్త్యల గిరిజమ్మ చేరింది. ఆమె పరిస్థితి విషమించడంతో మే 15న చనిపోయిందని ఆసుపత్రి సిబ్బంది మార్చురీలో గిరిజమ్మ మృతదేహాన్ని భర్త గడ్డయ్యకు చూపించారు. దీంతో గిరిజమ్మ ఖర్మకాండలు కుటుంబీకులు నిర్వహించారు. మే 23 కొడుకు రమేష్ సైతం కరోనాతో మృతి చెందాడు. దీంతో ఇద్దరి దశదిన కర్మలు పూర్తి చేశారు కుటుంబీకులు.
ఇదిలా ఉంటే మృతి చెందిందని ఖర్మకాండలు చేసిన గిరిజమ్మ జూన్ 2న ఇంటికి చేరుకుంది. ఈ సంఘటన చూసిన స్థానికులు ఇదేంటని ముక్కున వేలేసుకున్నారు. అయితే మార్చురీలో గడ్డయ్య చూసిన మృతదేహం గిరిజమ్మ పోలికలకు దగ్గరగా ఉండడంతో ఇలా జరిగిందని కుటుంబీకులు భావిస్తున్నారు. ఈ సంఘటనతో ప్రభుత్వాసుపత్రిలో సిబ్బందికి వారివారి విధుల పట్ల ఎంత నిబద్ధత ఉందో తెలుస్తొంది.