- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగా లోక్ అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం..
దిశ, సూర్యాపేట కలెక్టరేట్: జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టుల నందు నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో 650 పెండింగ్ కేసులను పరిష్కరించడం జరిగిందని జిల్లా ఎస్పీ S. రాజేంద్రప్రసాద్, జిల్లా జడ్జి వసంత్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టులో జడ్జి వసంత్ పాటిల్, ఎస్పీ S. రాజేంద్రప్రసాద్ కలిసి లోక్ అదాలత్ నిర్వహణపై చర్చించారు. పోలీసు శాఖ, న్యాయశాఖ కేసుల పరిష్కారానికి సమన్వయంగా పనిచేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. లోక్ అదాలత్ నందు కేసుల పరిష్కారం కోసం గత కొద్దిరోజులుగా న్యాయశాఖ, పోలీసు శాఖ, న్యాయ సేవా సంస్థ సిబ్బంది బాగా పని చేసిందని జడ్జి వసంత్ పాటిల్ అన్నారు. జిల్లా పోలీసులు, న్యాయశాఖ అధికారులు కక్షిదారులలో అవగాహన కల్పించి కేసుల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో DSP మోహన్ కుమార్, CI లు ఆంజనేయులు, విఠల్ రెడ్డి, SI లు సిబ్బంది ఉన్నారు.