ఆర్బీఐలో 322 ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్

by Harish |   ( Updated:2021-01-30 02:54:48.0  )
ఆర్బీఐలో 322 ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డు ఈ కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 322

ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి (డీఆర్‌) జ‌న‌ర‌ల్-పీవై: 270 పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీ లేదా త‌త్స‌మాన ప‌రీక్ష‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా పీజీ లేదా సంబంధిత టెక్నికల్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత.

ఆఫీసర్స్‌‌ ఇన్ గ్రేడ్ బి (డీఆర్‌) డీఈపీఆర్‌-పీవై: 29 పోస్టులు (డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్)

అర్హత: సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన లేదా పీజీడీఎం లేదా ఎంబీఏ (ఫైనాన్స్) లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

ఆఫీసర్స్‌‌ ఇన్ గ్రేడ్ బి (డీఆర్‌) డీఎన్ఐఎం‌-పీవై: 23 పోస్టులు (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్)

అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయస్సు: 01 స‌న‌వ‌రి 2021 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూసీ అభ్యర్థులకు ప‌దేండ్ల‌ గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎగ్జామినేష‌న్ (ఫేజ్ 1, ఫేజ్ 2, ఇంట‌ర్వ్యూ) ద్వా‌రా

ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామ్ 200 మార్కులకు ‌ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు. దీనిలో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ & రీజనింగ్ నుంచి ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో కనీసం మార్కులు సాధించిన వారిని మాత్రమే చేస్తారు పేజ్ -2 ఆన్లైన్ ఎగ్జామ్ కు అనుమ‌తిస్తారు. దీనిలో పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 విభాగాలుంటాయి. ఎక‌న‌మిక్ సోషల్ ఇష్యూస్ సబ్జెక్ట్ ల‌తో పేప‌ర్ 1 పరీక్ష ఉంటుంది. ఇందులో 50 శాతం ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో, 50 శాతం డిస్ర్టిపి్ట‌వ్ పద్ధతిలో నిర్వహిస్తారు. 100 మార్క‌ల‌కు ఉంటుంది. స‌మ‌యం 120 నిమిషాలు. పేప‌ర్ 2 ఇంగ్లిష్ (రైటింగ్ స్కిల్స్‌) డిస్ర్టిపి్ట‌వ్ ప‌ద్ద‌తిలో 100 మార్కుల‌కు ఉంటుంది. ప‌రీక్ష స‌మ‌యం 90 నిమిషాలు. పేప‌ర్‌3లో పైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్ స‌బ్జెక్టుల్లో 50 శాతం ఆబ్జెక్టివ్ టైప్, 50 శాతం డిస్ర్టిపి్ట‌వ్ ప‌ద్ద‌తిలో 100 మార్కుల‌కుగాను 120 నిమిషాలు కేటాయించారు.

ఇంటర్వ్యూ: ఫేజ్‌2 పరీక్ష (పేపర్ 1, పేపర్ 2, పేపర్3)లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంట‌ర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 75 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ కు సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది.

అప్లికేష‌న్ ఫీజు: ఎస్సీ, ఎస్టీల‌కు రూ.100, మిగ‌తా అభ్య‌ర్థుల‌కు రూ. 850

ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివ‌రితేదీ: 15 ఫిబ్ర‌వ‌రి, 2021

ప‌రీక్ష తేదీలు: మార్చి 6, 31, ఏప్రిల్ 1 (పోస్టుల‌వారీగా)

వెబ్‌సైట్‌: www.rbi.org.in

బెల్‌లో ట్రైనీ పోస్టులు

Advertisement

Next Story

Most Viewed