‘‘రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలి’’

by Shyam |
‘‘రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలి’’
X

విక‌లాంగుల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్య‌క్షులు గోరెంక‌ల న‌ర్సింహా డిమాండ్ చేశారు. బుధ‌వారం చౌటుప్ప‌ల్ మున్సిపాలిటీ కేంద్రంలో విక‌లాంగుల స‌మావేశం నిర్వహించాచారు. ఈ స‌మావేశంలో న‌ర్సింహా పాల్గొని మాట్లాడుతూ… మార్చి 7,8,9 తేదీల్లో యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఎన్‌పీఆర్‌డీ మూడో రాష్ట్ర మ‌హాస‌భ‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. జిల్లాలో విక‌లాంగుల‌కు ప్ర‌త్యేక స‌దుపాయాల‌తో కూడిన విక‌లాంగుల వ‌స‌తిగృహాలు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ స‌మావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story