- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రిపబ్లిక్ టీవీ సీఈవో అర్నాబ్ గోస్వామి అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్ : రిపబ్లిక్ టీవీ సీఈవో అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్పీ రేటింగ్ కేసు, పాల్ఘార్ ఘటన, ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. అర్నాబ్ ను ఇంటి నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్తున్న క్రమంలో అర్నాబ్‌ను పోలీసు వ్యాన్‌లోకి తోసివేశారు. పోలీసులు తన నివాసంలోకి అక్రమంగా ప్రవేశించి తనపై శారీరకంగా దాడి చేశారని అర్నాబ్ గోస్వామి ఆరోపించారు.
2018లో రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించకపోవడంతో.. ఓ డిజైనర్‌తో పాటు ఆయన తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై అర్నాబ్ పై కేసు నమోదు అయింది. కాంగ్రెస్ ఇంటీరియమ్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కించపర్చారని, పాల్ఘార్ దాడి ఘటన, బాండ్రా స్టేషనులో జనం మోహరించిన ఘటనలపై ముంబై పోలీసు స్టేషన్లలో వేర్వేరు కేసులు నమోదు చేశారు. అల్లర్లు రేపేందుకు కుట్ర పన్నారని, పరువునష్టం, ఉద్రిక్తతలు రేపేందుకు యత్నించారని అర్నాబ్ పై కేసులున్నాయి.