కోర్టులు కూడా పాలకులకు బానిసలైతే.. ‘రిపబ్లిక్’ టాక్!

by Shyam |   ( Updated:2023-05-19 13:19:19.0  )
Republic, Sai Dharam Tej
X

దిశ, సినిమా: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘రిపబ్లిక్’. దేవ కట్టా డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం సొసైటీలో పేరుకుపోయిన కరప్షన్, పొలిటికల్ గేమ్స్ గురించి చర్చించనుంది. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ‘రిపబ్లిక్’ సినిమా దేవ కట్టా నుంచి వస్తున్న మరో ‘ప్రస్థానం’ అవుతుందనిపిస్తోంది. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే ఎందుకు బ్రతకాల్సి వస్తుంది? అని టీజర్ ద్వారా ప్రశ్నించిన మేకర్స్.. ప్రజలు మాత్రమే కాదు సివిల్ సర్వెంట్స్, కోర్టులు కూడా రూలర్స్‌కు బానిసలుగా మారిపోయాయని, వ్యవస్థ పునాదులే కరప్ట్ అయినప్పుడు ఎవరెన్ని తప్పులు చేసినా అది కరెక్ట్ అయిపోతుందని వివరించారు. అలాంటి పరిస్థితులు మారాలంటే ఏం చేయాలి? అనేది సినిమాలో చూపించబోతుండగా.. ‘రిపబ్లిక్ మూవీ యూనిట్ చేసిన హానెస్ట్ అటెంప్ట్’ ఈ సినిమా అంటూ సోషల్ మీడియాలో టీజర్ షేర్ చేశాడు తేజ్.

ఇలాంటి స్పెషల్ మూవీ చేయడం చాలా రిఫ్రెషింగ్‌గా ఉందని, ఇంత గొప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న దర్శకులు దేవ కట్టాకు థాంక్స్ చెప్పాడు. కాగా జగపతిబాబు, రమ్యకృష్ణ, ఐశ్వర్యా రాజేష్ ప్రధానపాత్రల్లో కనిపించబోతున్న సినిమాను జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. జూన్ 4న సినిమా విడుదల కాబోతుండగా.. ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అంటున్నారు నెటిజన్లు. దేవ కట్టా ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌ ఎక్కేస్తారని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed