- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏలూరు వింత వ్యాధికి కారణం ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వానికి అంతుచిక్కని విధంగా మారిని ఏలూరు వింత వ్యాధిపై నివేదిక వచ్చింది. పురుగుల మందులకు సంబంధించిన అవశేషాలే వింత వ్యాధికి కారణమంటూ ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్ సహా ప్రఖ్యాత సంస్థలు నివేదికలు ఇచ్చాయి. నేపథ్యంలోనే మనుషుల శరీరంలోకి ఎలా ప్రవేశించాయనే అంశంపై మరింత అధ్యయనం అవసరమని నిపుణులు చెప్పారు.
దీంతో సమగ్ర అధ్యయణానికి ఢిల్లీ, ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి బాధ్యతలు అప్పగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, వ్యాధి బారీన పడిన బాధితులకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలని స్పష్టం చేశారు. దీనికి తోడు ప్రతి జిల్లాలో కూడా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని.. ఆహారం, తాగునీరు మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, పరీక్షల ఫలితాల ఆధారంగా తగు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. దీనిపై పూర్తి కార్యచరణను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీని ఆదేశించారు. అలాగే, ఏలూరు ఘటనలు మరోసారి పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. కెమికల్ వాడకాన్ని తగ్గిస్తూ.. ఆర్బీకేల ద్వారా సేంద్రీయ పద్ధతుల వ్యవసాయానికే పెద్దపీఠ వేయాలని సీఎం హితవు పలికారు.
హైపవర్ కమిటీ నియామకం:
అయితే, సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సంస్థల నుంచి భిన్నాభిప్రాయాలు, నివేదికలు వచ్చాయి. దీంతో అన్ని పరిశోధనల సంస్థల అధ్యయనాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు జగన్ హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే రెడ్రోజుల పాటు హైపవర్ కమిటీ ఈ నివేదికలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయనుంది. ఏలూరు వింత వ్యాధికి ఖచ్చితమైన కారణాలను కూడా అధ్యయణం చేశాకే స్పష్టం చేస్తామని అధికారులు కూడా తెలిపారు.