నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేసీఆర్.. వాటి తర్వాతే ఖాళీలు

by Shyam |   ( Updated:2021-08-15 01:11:26.0  )
independence day celebrations
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 33 జిల్లాల ప్రకారం కొత్త జోనల్​ విధానం అమల్లోకి వచ్చిందని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. ఈ జోనల్​ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన జరుగుతుందని, త్వరలోనే ఉద్యోగుల బదిలీలు ఉంటాయన్నారు. కొత్త ఉద్యోగాల భర్తీకి అడుగులు వేస్తున్నామని, జోనల్​ విధానం ప్రకారం ఉద్యోగుల బదిలీలు చేసిన తర్వాత ఖాళీలపై నివేదిక వస్తుందని, ఆ తర్వాత భర్తీ ప్రక్రియ ఉంటుందని ప్రసంగంలో సీఎం కేసీఆర్​ ప్రకటించారు.

పీవీ సేవలు చిరస్మరణీయం..

మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు సేవలను ప్రభుత్వం ఏడాదిపాటు గుర్తు చేసిందని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం అభినందనీయమని సీఎం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రామప్ప పేరు మారుమ్రోగుతుందన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి చాలా ఉందన్నారు. అదే విధంగా యాదాద్రి ఆలయం కూడా రాష్ట్రానికి తలమానికంగా మారుతుందని, ఆధ్మాత్మిక కల ఉట్టిపడేలా యాదాద్రిని పుననిర్మిస్తున్నామన్నారు. త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed