నెలాఖరులో రెనాల్ట్ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్!

by Harish |
నెలాఖరులో రెనాల్ట్ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ తన రాబోయే కాంపాక్ట్ ఎస్‌యూవీల కిగర్‌ను ఈ నెలాఖరున భారత్‌లో విడుదల చేయనున్నట్టు మంగళవారం ప్రకటించింది. జనవరి 28న దేశీయ వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న కిగర్‌ను తీసుకురానున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా ఈ మోడల్‌ను భారత్‌లో విడుదల చేసిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో విడుదల చేయాలని భావిస్తున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది.

కిగర్ మోడల్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతీ విటారా బ్రెజా, హ్యూండాయ్ వెన్యూ, కియా సొనెట్, టాటా నెక్సాన్, నిస్సాన్ మాగ్నైట్ లాంటి మోడళ్లతో పోటీ పడనున్నట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరికొత్త కిగర్ అత్యాధునిక ఫీచర్లతో రానుందని, ఈ మోడల్ ఉత్తమ స్టైలింగ్‌తో బెస్ట్-ఇన్ క్లాస్ డిజైన్‌తో వస్తుందని కంపెనీ వివరించింది. కిగర్‌ను బి-సెగ్మెంట్‌లో లభిస్తుందని, మొత్తం పరిశ్రమ అమ్మకాల్లో 50 శాతానికిపైగా వాటాను దక్కించుకోగలదని, దేశవ్యాప్తంగా కంపెనీ ఉనికిని పెంచేందుకు ఈ మోడల్ ఎంతో సహాయపడుతుందని నమ్ముతున్నట్టు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం రెనాల్ట్ నుంచి డస్టర్, క్విడ్, ట్రైబర్ లాంటి మోడళ్లు మార్కెట్లో వినియోగదారుల నుంచి మెరుగైన ఆదరణను కలిగి ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed