‘సీఏఏ ఆందోళనకారుల పోస్టర్లు తొలగించండి’

by Shamantha N |
‘సీఏఏ ఆందోళనకారుల పోస్టర్లు తొలగించండి’
X

లక్నో : ఉత్తరప్రదేశ్ సర్కారుపై అలహాబాద్ హైకోర్టు మండిపడింది. లక్నో రోడ్లపై సీఏఏ వ్యతిరేక ఆందోళనకారుల వివరాలు, ఫొటోలను ముద్రించిన పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టింది. ఇది ప్రజల గోప్యత హక్కుని ఉల్లంఘించిడమేనని పేర్కొంది. సీఏఏ వ్యతిరేక ఆందోళన(డిసెంబర్ 19న)లో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి సంబంధించిన కేసు నిందితుల ఫొటోలను, వివరాలను యూపీ ప్రభుత్వం రద్దీ కూడళ్లలో పోస్టర్లుగా వేసింది. ఈ పోస్టర్లు తమ జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నాయని నిరసనకారులు ఆందోళన చెందారు. అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గోవింద్ మాథుర్, జస్టిస్ రమేష్ సిన్హాల డివిజన్ బెంచ్ ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి విచారిస్తున్నది. ఆ పోస్టర్ల తొలగింపుపై మార్చి 16లోపు నివేదిక అందించాలని లక్నో జిల్లా అధికారులను ఆదేశించింది. ఆర్టికల్ 21 కల్పిస్తున్న జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలోనే గోప్యత హక్కు ఇమిడి ఉంటుందని గుర్తు చేసింది.

Tags: allahabad high court, UP government, anti CAA protesters, vandalism

Advertisement

Next Story

Most Viewed