- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.3,947 కోట్లకు జస్ట్ డయల్-రిలయన్స్ రిటైల్ ఒప్పందం
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్ సంస్థ దేశీయ దిగ్గజ సెర్చ్ ఇంజిన్ కంపెనీ జస్ట్ డయల్‌లో నియంత్రణ వాటాను కొనుగోలు చేసినట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ రూ. 3,497 కోట్లని ఓ ప్రకటనలో తెలిపింది. తాజా ఒప్పందం ప్రకారం రిలయన్స్ రిటైల్‌కు 40.95 శాతం వాటా సాధించిందని, టెకోవర్ నిబంధనల ప్రకారం అదనంగా 26 శాతం వరకు వాటాను దక్కించుకునేందుకు ఓపెన్ ఆఫర్ అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
తదుపరి నిర్ణయం తీసుకునే వరకూ జస్ట్ డయల్‌కు వీఎస్ఎస్ మణి మేనేజర్ డైరెక్టర్, సీఈఓగా కొనసాగుతారని రిలయన్స్ సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ‘జస్ట్ డయల్‌ను వ్యూహాత్మక వ్యాపార విధానం, పట్టుదలతో బలమైన సంస్థగా కొనసాగించిన మొదటితరం వ్యవస్థాపకుడు వీఎస్ఎస్ మణితో భాగస్వామ్యం సంతోషంగా ఉంది. జస్ట్ డయల్‌లోని లక్షలాది భాగస్వామ్య వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు డిజిటల్ సౌకర్యాలను పెంచేందుకు మరింత కృషి చేయనున్నాం. అనుభవం కలిగిన జస్ట్ డయల్ యాజమాన్యంతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని’ రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ అన్నారు.