ఆ సంస్థలో రెండు కంపెనీల భారీ పెట్టుబడులు!

by Harish |   ( Updated:2020-10-03 03:26:40.0  )
ఆ సంస్థలో రెండు కంపెనీల భారీ పెట్టుబడులు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్‌వీఎల్)లో పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఇటీవల సిల్వర్ లేక్, జనరల్ అట్లాంటిక్ సంస్థలు ఆర్ఆర్‌వీఎల్‌లో ఇన్వెస్ట్ చేయగా తాజాగా సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ జీఐసీ, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజ సంస్థ టీపీసీ కేపిటల్ కంపెనీలు రిలయన్స్ రిటైల్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులను ప్రకటించాయి.

జీఐసీ సంస్థ రూ. 5,512.5 కోట్లను, టీపీజీ సంస్థ రూ. 1,837.5 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు రిలయన్స్ సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ పెట్టుబడులతో జీఐసీ సంస్థ 1.22 శాతాన్ని, టీపీజీ 0.41 శాతాం ఈక్విటీ వాటాను దక్కించుకోనున్నాయి. ఇప్పటివరకూ ఆర్ఆర్‌వీఎల్‌లో 7.28 శాతం వాటాల విక్రయం ద్వారా రిలయన్స్ సంస్థ రూ. 32,197 కోట్ల పెట్టుబడులను సాధించింది. జీఐసీ నెట్‌వర్క్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యం ద్వారా భారత మార్కెట్లోని రిటైల్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు వీలవుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చెప్పారు.

ఆర్ఆర్‌వీఎల్‌కు ఉన్న సరఫరా గొలుసు, స్టోర్ల నెట్‌వర్క్, లాజిస్టిక్స్ వంటి వాటి ద్వారా వినియోగదారులకు, వాటాదారులకు మరిన్ని ప్రయోజనాలను అందించే వీలుంటుందని జీఐసీ సీఈవో లిమ్ చౌ కియత్ వెల్లడించారు. రిలయన్స్ సంస్థ మెరుగైన టెక్నాలజి కలిగి ఉంది. అలాగే, భారత్‌లో రిలయన్స్ రిటైల్ పటిష్టంగా కొనసాగుతోంది. నూతన ఆలోచనలతో, రిటైల్ పరిశ్రమలో లీడర్‌గా ఉన్న ఆర్ఆర్‌వీఎల్‌తో కొనసాగడం సంతోషంగా ఉందని టీపీజీ కో-సీఈవో జిమ్ కాల్టర్ చెప్పారు.

Advertisement

Next Story