‘రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి’

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకోని దేశవ్యాప్తంగా జైల్లలో ఉన్న రాజకీయ ఖైదీలను విడుదల చేయలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ రాష్ట్ర కార్యదర్శి బి నరసింహ అన్నారు. అనారోగ్యం పరిస్థితులలో ఖైదీలు జైల్లలో మరణిస్తే అవి ప్రభుత్వం చేసే హత్యలుగానే పరిగణించాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. ఈ విషయమై బి నరహింహ ఓ ప్రకటన చేశారు. రాజకీయ ఖైదీలందరిని వెంటనే పెరోల్ పై లేదా బెయిల్ పై కానీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలలుగా యావత్ ప్రపంచమంతటా (కోవిడ్-19) కరోనా వైరస్ మహమ్మారి విజృభింస్తుందన్నారు. ఇది దీర్ఘకాల కార్యక్రమంగా ఉంటుందనేది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని పేర్కొన్నారు. ఈలాంటి సమయంలో జైల్లలో ఉన్న సాధారణ ఖైదీలతో పాటు, రాజకీయ ఖైదీల ప్రాణాలకు హాని కలిగే ప్రమాదం ఉందని మేధావులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. భీమా కొరేగావ్ కేసులో అరెస్టు చేసి ముంబాయి తలోజ జైల్లలో నిర్భందించిన వరవరరావు, సోమాసేన్, సుధా భరద్వాజ, మహేష్‌రావత్, సురేంద్ర, గౌతం నవలాఖా, రోణావిల్సన్, అరుణ్‌ఫెరీరా, సుధీర్ ధావలేలను, ఆనంద్, ధీర్ఘ కాలంగా నాగపూర్ జైలులో ఉన్నా ప్రొ. సాయి బాబాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో దిన దినం వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకోని ఖైదీలను ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రభుత్వాలు కృషిచేయాలని కోరారు.

Advertisement

Next Story