రైతు బంధు నిధుల విడుదలపై అన్నదాతల్లో ఆనందం

by Shyam |   ( Updated:2021-12-29 02:46:08.0  )
రైతు బంధు నిధుల విడుదలపై అన్నదాతల్లో ఆనందం
X

దిశ, జిన్నారం : జిన్నారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 8వ విడత రైతుబంధు నిధులు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత వ్యవసాయం బాగుపడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్.. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పూడికతీసి బాగు చేశారని అన్నారు. దాని ద్వారా భూగర్భజలాలు పెరిగాయని ప్రశంసించారు.

రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్ వంటి పథకాలు రూపకల్పన చేసారని కొనియాడారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రతీ ఎకరాకు నీరు అందిస్తున్నారని అన్నారు. రైతు ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రంలో తగ్గుదల అయినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైతుబంధు, రైతు బీమా పథకాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు.

ప్రపంచంలోనే 20 వినూత్న పథకాలలో రైతుబంధు, రైతు బీమా ఉండడం నిజంగా గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా మండల రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story