గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా విడుదల

by Shyam |
Srinivas Gowd
X

దిశ, తెలంగాణ బ్యూరో : గీత వృత్తిలో ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత అంగవైకల్యం, తీవ్రంగా గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అందజేస్తున్న ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం విడుదల చేసింది. బుధవారం రూ.11,46,50,000కు సంబంధించిన జీవోను జారీ చేసింది. నిధులను విడుదల చేసిన సీఎం కేసీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గీత కార్మికుల కుటుంబాల తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్స్ గ్రేషియోను 2009 ఏప్రిల్ 1 నుంచి 2021 ఏప్రిల్ 30 వరకు గీత వృత్తిలో ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత అంగవైకల్యం చెందిన, తీవ్రంగా గాయపడిన, అర్హులైన గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియోను అందజేయడం జరుగుతుందన్నారు. వారం రోజుల్లోనే పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

గీత వృత్తిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన 90 మంది, శాశ్వత అంగవైకల్యం చెందిన 109 మంది, తీవ్రంగా గాయపడిన 225 మంది గీత కార్మికులకు ఈ ఎక్స్ గ్రేషియోతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు గీత కార్మికుల పట్ల నిర్లక్ష్యం చేశాయన్నారు. ఇచ్చే అరకొర ఎక్స్ గ్రేషియో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి గతంలో ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ దూరదృష్టితో కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్స్ గ్రేషియోను రూ.50 వేలు ఇస్తే తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ 2 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. అనంతరం గీత కార్మికుల సంక్షేమంను దృష్టిలో పెట్టుకొని ఎక్స్ గ్రేషియోను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed