భారీగా తగ్గిన చికెన్ ధరలు

by Shyam |
భారీగా తగ్గిన చికెన్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అనూహ్యంగా తగ్గాయి. ఇటీవల కొండెక్కిన చికెన్ ధరలు.. వారం రోజుల వ్యవధిలోనే తగ్గుముఖం పట్టడం ఆశ్చర్యకరం. ముఖ్యంగా హైదరాబాద్‌లో గత వారం క్రిందట రూ. 200 నుంచి రూ. 250 వరకు పెరిగాయి. ధరలు మరీ ఇంతగా పెరిగితే ఎలా అంటూ చికెన్ ప్రియులు ఆందోళన చెందారు. కానీ, గత రెండు, మూడు రోజుల నుంచి చికెన్ ధరలు ఏకంగా రూ. 180 నుంచి రూ. 150 వరకు తగ్గడం విశేషం. రూ. 120గా ఉన్న ఫామ్‌గేట్ ధర రూ.75 నుంచి రూ. 85 మేర తగ్గడంతో చికెన్ వినియోగం పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో గత వారం వ్యవధిలోనే చికెన్ ధర సుమారు రూ. 50 నుంచి రూ. 80 వరకు తగ్గింది. మరోవైపు కరోనా ఉధృతి నేపథ్యంలో కోళ్ల పౌల్ట్రీల్లో కూలీలు తగ్గడంతో కోళ్ల పెంపకం, వ్యాపారం కష్టతరం అవుతోంది. దీంతో వచ్చిన ధరకే కోళ్ల ఫారం నిర్వాహాకులు అమ్మకాలు చేస్తున్నట్టు సమాచారం.

Advertisement

Next Story