రెడ్ జోన్ నుంచి ఆరెంజ్‌కి మారాలంటే ఇలా జరగాలి: జవహర్‌రెడ్డి

by srinivas |
రెడ్ జోన్ నుంచి ఆరెంజ్‌కి మారాలంటే ఇలా జరగాలి: జవహర్‌రెడ్డి
X

రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కి ఎలా మారుతుందో ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. ఏపీలో కరోనా నివారణకు రెండు వ్యూహాలు రచించామన్నారు. కంటైన్మెంట్ క్లస్టర్, ఆస్పత్రుల ద్వారా కోవిడ్‌ను నియంత్రించాలని భావిస్తున్నామని తెలిపారు. ఏపీలో మొత్తం 154 ప్రాంతాలను కంటైన్ మెంట్ క్లస్టర్లుగా గుర్తించామని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇవి మరింత విస్తృతమైతే ఇప్పటి వరకు క్వారంటైన్ సెంటర్లుగా వినియోగిస్తున్న ప్రాంతాలను కొవిడ్ కేర్ సెంటర్లుగా మారుస్తామని ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లాలో నమోదైన కేసుల్లో గుంటూరు టౌన్ నుంచి ఎక్కువ శాతం కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. రెడ్ జోన్ లో ఆంక్షలు కొనసాగుతాయన్న ఆయన, వరుసగా రెండు వారాల పాటు కొత్త కేసులు నమోదు కాకపోతే రెడ్ జోన్‌ను ఆరెంజ్ జోన్‌గా మారుస్తామని వివరించారు. ఈ నెల 20 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూసి మండలాలను మళ్లీ జోనింగ్ చేస్తామని చెప్పారు

తిరుపతి, కర్నూలులో కరోనా పరీక్షల కోసం ఒక్కో ల్యాబ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. గత పది రోజుల్లో 12 వేలకు పైగా నమూనాలు పరీక్షించామన్న ఆయన, వారంలోగా ముప్పై రెండు వేల మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కరోనా నిర్ధారణకు పూల్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఉన్న వనరులను పొదుపుగా వాడటమే ఈ టెస్టుల లక్ష్యమని ఆయన తెలిపారు.

Tags: corona virus, ap, covid-19, jwahar reddy, health department

Advertisement

Next Story

Most Viewed