- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉపాధి పథకంలో మనమే నెంబర్ వన్: ఎర్రబెల్లి
దిశ, న్యూస్‌బ్యూరో: ఉపాధి హామీ పథకం వినియోగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. 2020-21 ఏడాదికి 13 కోట్ల పనిదినాల లక్ష్యం కాగా, ఇప్పటికే 9.81 కోట్ల పనిదినాలను పూర్తి చేసుకున్నామన్నారు. కరోనా కష్ట కాలంలోనూ ఉపాధి హామీలో నెంబర్ వన్‌గా నిలిచి ఆదర్శంగా ఉన్నామన్నారు. రాష్ట్రానికి జాతీయ అవార్డులు వచ్చిన సందర్భంగా బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో మరే రాష్ట్రానికి దక్కని విధంగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖకు 7 జాతీయ ఉత్తమ అవార్డులు వచ్చాయన్నారు. జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ మూడు కేటగిరీల్లోనూ జనరల్ కోటాలో తెలంగాణకు అవార్డుల పంట పండిందన్నారు. ప్రతి ఏటా కేంద్రం మూడు విభాగాల్లో ఈ దీన్ దయాళ్ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కార్ అవార్డులను ప్రకటిస్తున్నదని, దార్శనికతకు, పనితీరుకు ఈ అవార్డులు నిదర్శనమన్నారు.