డాక్టర్ గారు.. నా వృషణాలు కిందికి, పైకి ఉన్నాయి.. సమస్య ఏంటి?

by Bhoopathi Nagaiah |   ( Updated:2025-04-25 14:13:01.0  )
డాక్టర్ గారు.. నా వృషణాలు కిందికి, పైకి ఉన్నాయి.. సమస్య ఏంటి?
X

డాక్టర్! నా వయసు 24. నాలుగేళ్లుగా ఎడమ వృషణం.. కుడి వృషణం (testicle) కంటే కిందికి జారి ఉంది. పైగా కాస్త లావుగా కూడా ఉంది. దాన్ని నొక్కి చూస్తే అడుగు భాగాన నాకు చిన్న చిన్న నరాలు లాగా తగులుతున్నాయి. ఈ మధ్య నెలకోసారి.. ఎడమ కాలు, ఎడమ చేయి, ఎడమ భుజం విపరీతంగా నొప్పి పెడుతున్నాయి. ఎడమ కాలు తొడ మీద ఎడమ భుజం మీద నాలుగైదు కనుతుల్లాగా వచ్చాయి. వాటిని నొక్కితే గట్టిగా ఉన్నాయి. పొత్తికడుపు ఎడమవైపున వాపు కూడా ఉంది. నా సమస్యను ఏమంటారు ? ఇవి తీరాలంటే ఏం చేయాలి ? - ఎమ్మెఎస్, వరంగల్.

జవాబు : మీకు వేరికోసిల్ (Varicocele) ఉన్నట్టుంది. మామూలుగా ఒక వృషణం కిందికి, ఒకటి పైకి ఉంటాయి. అయితే మీరు చెప్పినట్టు వాపు ఉండడము రక్తనాళాలు తగలడం వేరికోసిల్ లక్షణాలు. ఇది గ్రేడ్ వన్‌లో ఉంటే సర్జరీ అవసరం లేదు. మందులతో తగ్గుతుంది. గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అయితే చికిత్స లేదా సర్జరీ అవసరం. మీకు గడ్డలుగా తగులుతున్నవి లింపు గ్రంథులు. దీనిని లింపాడి నోపతి అంటారు. శరీరంలో ఇన్ఫెక్షన్ ఉందని సూచనలు ఇస్తాయి ఈ లింప్ గ్లాండ్స్. మీరు వెంటనే ఆండ్రాలజిస్ట్‌ని సంప్రదించి చికిత్స తీసుకోండి. అలాగే ఒకసారి టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయి సెమెన్ అనాలసిస్ చేయించుకోండి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

👉 మరిన్ని సెక్స్ & సైన్స్ వార్తల కోసం సందర్శించండి



Next Story