- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
CCPA: ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్లపై కేంద్రం కొరడా.. అసలు విషయం ఇదే!

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఐఐటీ-జేఈఈ (IIT-JEE), నీట్ (NEET) పరీక్ష ఫలితాలు విడుదలవుతోన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్లపై కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ కన్‌జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) కొరడా ఝళిపించింది. వాస్తవానికి విరుద్ధంగా తప్పుడు ర్యాంకులను ప్రకటిస్తూ.. జనాన్ని మోసం చేస్తున్నారని పలు కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుంది. మరికొన్ని కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలను వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తూ జరిమానాలు విధిచింది.
ఆయా కోచింగ్ సెంటర్లుకు CCPA 2024లో నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించింది. అందులో విద్యార్థులు సాధించిన ర్యాంకుల వివరాలు ఖచ్చితమైనవిగా ఉండాలని, ఇతరును తప్పుదారి పట్టించకుండా ఉండేలా చూసుకోవన్నారు. ర్యాంకు సాధించిన విద్యార్థుల పేర్లు, ర్యాంకులు, కోర్సు లాంటి వివరాలను పారదర్శకంగా బహిర్గతం చేయాలని CCPA పేర్కొంది. ఎవరైనా నిబంధనలకు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటి వరకు ఉల్లంఘనలు అతిక్రమించిన 24 కోచింగ్ సెంటర్లపై దాడులు చేసి 49 నోటీసులు జారీ చేశామని, రూ.77.60 లక్షల జరిమానాలు విధించామిన సీసీపీఏ అధికారులు వెల్లడించారు.