- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
EAPCET-2025: ఈఏపీసెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో ఈఏపీసెట్ అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ నెల(ఏప్రిల్) 4వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది, అగ్రికల్చర్ ఫార్మా ప్రవేశ పరీక్షకు 86,101 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అర్హత గల అభ్యర్థులకు ఈ ఎంట్రన్స్ ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈఏపీసెట్(EAPCET-2025) నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ నెల(ఏప్రిల్) 29 నుంచి వచ్చే నెల(మే) 4 వరకు తెలంగాణ(Telangana) ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉన్నత విద్యా మండలి అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
EAPCET ముఖ్యమైన తేదీలు..
*ఈ నెల 22 నుంచి ఇంజినీరంగ్ విభాగం హాల్‌టికెట్లు విడుదల అవుతాయి.
*ఈ నెల(ఏప్రిల్) 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్ష జరుగుతుంది.
*మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి. అయితే ఈ పరీక్షలు రోజూ రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 124 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
*పూర్తి వివరాల కోసం అధికారిక https://eapcet.tgche.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.