- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెడ్ అలర్ట్.. ఇవాళ, రేపు భారీ వర్షాలు
దిశ, వెబ్ డెస్క్: తాజాగా వాతావరణ శాఖ ఓ ప్రకటన చేసింది. తమిళనాడులో ఇవాళ, రేపు భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరికొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా చెన్నై సహా తమిళనాడులోని 20 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి రేపు ఉదయానికి తమిళనాడు ఉత్తర తీరానికి చేరుకుంటుందని, దక్షిణాది రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న పుదుచ్చేరి, కారైకాల్‌లో భారీ నుంచి అతి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ‘రెడ్ అలర్ట్’ ను ప్రకటించి అధికార యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
ఇదిలా ఉంటే.. గత కొద్దిరోజుల నుంచి తమిళనాడును వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. జనజీవనం మొత్తం అస్తవ్యస్తమైంది. ఇప్పటికీ కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.