- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా పరిస్థితికి ఇదే కారణమా?
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మరణాల్లో చైనా, ఇటలీ దేశాలను అగ్రరాజ్యం అమెరికా దాటేసింది. అక్కడ ఇంత తీవ్రంగా వ్యాధి ప్రబలడానికి కారణం వారు విమానాలను అనుమతించడమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీసు వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్24 వారు అమెరికా మీదుగా ప్రయాణిస్తున్న విమానాలను ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
ప్రపంచం మొత్తం మీద 4800 విమానాలు తిరుగుతుంటే వాటిలో మూడింట రెండు వంతులు అమెరికా మీదే తిరుగుతున్నాయి. సాధారణ సమయాల్లో దాదాపు 13వేలకు పైగా విమానాలు తిరుగుతుండేవి. కానీ క్వారంటైన్ కారణంగా వాటి సంఖ్య దారుణంగా తగ్గిందని ఫ్లైట్‌రాడార్ పేర్కొంది. అయితే అమెరికా మీద ఇన్ని విమానాలు తిరుగుతుండటాన్ని నెటిజన్లు తప్పుబట్టారు. విమాన సేవల విషయంలో ఎలాంటి క్వారంటైన్ పాటించకపోవడం వల్లనే ఇలా మరణాలు పెరుగుతున్నాయని వారు అంటున్నారు. అయితే ప్రస్తుతానికి విమాన సర్వీసులు అత్యవసర ఆహార పదార్థాలు, మెడిసిన్ కోసమే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.