- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రియల్టర్స్ సచివాలయ ముట్టడి ఉద్రిక్తత
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ లేఅవుట్లలో నిలిపివేసిన ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ మంగళవారం చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతంగా మారింది. పలు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన రియల్టర్స్ ఆదర్ష్ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌నుంచి ర్యాలీగా సచివాలయం వైపు వచ్చారు. ముట్టడిని గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు రియల్టర్స్‌కు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
ఐదుగురు సభ్యులతో కూడిన ప్రతినిధులు బృందాన్ని సీఎస్ సోమేష్‌కుమార్ కు వినతి పత్రం సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలని కోరినా పోలీసులు ససేమిరా అన్నారు. బీఆర్కే భవన్ వైపునకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పలువురు అసోసియేషన్ నేతలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల ఎకరాల్లో గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయని, వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా నిలిపివేశారన్నారు. ఎలాంటి షరతులు లేకుండా వాటికి కూడా రిజిస్ట్రేషన్లను అనుమతించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ లేఅవుట్ లో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల రియల్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్నారని చెప్పారు. దీంతో పాటు ప్లాట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారని చెప్పారు.
అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. నర్సయ్య మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ చార్జీలను, భూముల మార్కెట్ విలువలను పెంచడంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉందన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్, కార్యదర్షి పగడాల రంగారావులు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ లేఅవుట్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. సచివాలయ ముట్టడి కార్యక్రమానికి షాద్ నగర్ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. రాజు గౌడ్, ఖమ్మం, మల్కాజిగిరి, రంగారెడ్డి, నిజామాబాద్, జనగాం, వరంగల్, వికారాబాద్జిల్లాల అధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు, లక్ష్మణరావు, గడ్డం నవీన్ రెడ్డి, మహ్మద్ జియా అహ్మద్, కుమార్, శ్యాంరావు, హరిబాబు షాద్ నగర్ సెక్రటరీ ఎం.అశోక్, నాయకులు రాంచంద్రయ్య, జి. రమేష్ బౌరయ్య, ఐదర్ గోరి, ఎండీ కబీర్, సతీష్, తాయర్, బొమ్మగోని వెంకటేష్, యోగానంద్ తదితరులు పాల్గొన్నారు.