- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉలిక్కిపడిన కుడకుడ.. రియల్టర్ దారుణ హత్య
దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లాలో దారుణ హత్య జరిగింది. చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో పొలం వద్దకు వెళ్లిన గుర్రం శశిధర్ రెడ్డి అనే వ్యక్తిని కొడవళ్లతో నరికి దుండగులు హత్య చేశారు. గ్రామ శివారులోని పొలాల మధ్య శశిధర్ రెడ్డిని కొడవలిలో విచక్షణ రహితంగా నరకడంతో ఆయన పొలంలోనే ప్రాణాలు వదిలాడు.
కాగా శశిధర్ రెడ్డి నాలుగేళ్ల క్రితం భార్యపై అనుమానంతో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భార్యను హత్య చేస్తుండగా చూసిన కుమారుడిని కూడా హతమార్చడనే అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శశిధర్ రెడ్డి హత్యకు గురైనట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం.. రియలెస్టెట్ చేసే శశిధర్ రెడ్డికి భూవివాదాలు కూడా ఉన్నాయని, హత్యకు అవి కూడా కారణం కావచ్చని చెబుతున్నారు. చివ్వెంల పోలీసులు ఘటన స్థలానికి చేరుకోని కేసు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.