వచ్చే మార్చి నాటికి కరోనా వ్యాక్సిన్ రావొచ్చు!

by  |
వచ్చే మార్చి నాటికి కరోనా వ్యాక్సిన్ రావొచ్చు!
X

దిశ, వెబ్‌డెస్క్ :
ఆస్ట్రాజెనికా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రయత్నాలు ప్రోత్సాహరక ఫలితాలు ఇస్తుండటంతో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) త్వరలో 70 నుంచి 80 కోట్ల మోతాదు వ్యాక్సిన్‌లను తయారు చేయనున్నట్లు తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ను వ్యాక్సిన్ తయారీ కోసం ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రజెనికా సంయుక్తంగా ఎంపిక చేశాయి. తాజాగా, సీరం ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడర్ పూర్నావాలా ఓ ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా వ్యాక్సిన్ భవిష్యత్తు, తయారీ, పంపిణీ అంశాలపై సంస్థ ప్రణాళిక గురించి చెప్పారు. మరో నెలరోజుల్లో ఆస్పత్రుల్లో బాధితులపై ట్రయల్స్ ప్రారంభిస్తామని, ఇప్పటికే ముంబై, పూణెలలో ట్రయల్స్ కోసం ఆస్పత్రులను గుర్తించామన్నారు.

అయితే, ఎంతమంది పై చేయాలనేదాని పై ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. నవంబర్ వరకు ట్రయల్స్ పూర్తయిన అనంతరం బహుశా, డిసెంబర్ లేదా వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి వ్యాక్సిన్ రావచ్చు. దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరడానికి కొంత సమయం పడుతుందన్నారు. అయితే, హెల్త్ వర్కర్ల కోసం దాన్ని డిసెంబర్ నాటికి సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ముందుగా డిసెంబర్‌లో హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని భావిస్తున్నట్టు అడర్ పూర్నావాలా అభిప్రాయపడ్డారు. అలాగే, ఏడాదికి సుమారు 80 కోట్ల డోసులను తయారు చేయ్యాలనే లక్ష్యంతో ఉన్నామని, ఒకవేళ ముందే వచ్చినట్లయితే డిసెంబర్‌లోనే 30 కోట్ల డోసులను తయారు చేయ్యగలమని పేర్కొన్నారు. కాగా, ప్రపంచంలోని అందరికీ వ్యాక్సిన్ అందాలంటే కనీసం మూడు నుంచి నాలుగేళ్లు సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed