కస్టమర్లకు గుడ్‌న్యూస్ : ATMలలో నో క్యాష్ బోర్డులుంటే ఫైన్ : RBI

by Harish |   ( Updated:2021-08-10 22:03:57.0  )
no-cash
X

దిశ, వెబ్‌డెస్క్: ఇకపై బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లు వారి ఏటీఎం కేంద్రాల్లో నిర్దేశించిన సమయం వరకు నగదు లేకుండా ఉంచితే జరిమానా విధించనున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఏటీఎం కేంద్రాల్లో వినియోగదారులు అసౌకర్యానికి గురయ్యేలా నెలలో 10 గంటల కంటే ఎక్కువ సమయం ఏటీఎం మెషీన్లలో నగదును నింపకపోతే జరిమానా విధించేలా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఏటీఎంలలో నగదు నింపడంపై కనీస వ్యవధిని నిర్ధారించుకోవాలని బ్యాంకులతో పాటు ఏటీఎం అపరేటర్లను ఆదేశించింది. ‘బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లు ఏటీఎంలలో నగదు లభ్యతకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించడానికి, సకాలంలో తిరిగి నింపడానికి తమ వ్యవస్థలను, యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని’ ఆర్‌బీఐ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

దీనికి సంబంధించి విధానాలు పాటించకపోతే తీవ్రంగా పరిగణిస్తామని, మానిటరీ పరమైన జరిమానా ఉంటుందని తెలిపింది. ఒక నెలలో 10 గంటల కంటే ఎక్కువ సమయం ఏటీఎంలో నగదు లేకపోతే ఒక ఏటీఎం కేంద్రానికి రూ. 10 వేల జరిమానా బ్యాంకులకు విధించడాన్ని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని పేర్కొంది. ఆర్‌బీఐ విభాగానికి నగదు తిరిగి నింపని ఏటీఎంల సమయానికి సంబంధించి సిస్టమ్ జనరేటెడ్ స్టేట్‌మెంట్‌ను సమర్పించాలని బ్యాంకులను ఆర్‌బీఐ కోరింది. ఈ స్టేట్‌మెంట్లను ప్రతినెలా సమర్పించాలని ఆర్‌బీఐ వెల్లడించింది.

Advertisement

Next Story