విలీనం ఆగదు!

by Shyam |
విలీనం ఆగదు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఊరంతా ఒకదారైతే ఉలిపిరి కట్టెదొక దారన్నట్టు దేశమంతా కరోనాతో యుద్ధం చేస్తోంటే కేంద్ర బ్యాంకుల విలీనాన్ని మాత్రం ఆపేది లేదని చెబుతోంది. ఇప్పటికే బ్యాంకుల విలీనంలో అనే ఆటంకాలున్నాయి. బ్యాంకుల లోగోల సమస్య, అధికారుల బదిలీ సమస్య ఒకవైపుంటే ఆంధ్రాబ్యాంకు వంటి తెలుగువారి సొంత బ్యాంకును మరొక బ్యాంకులో విలీన చేసే అంశంపై విమర్శలు మరోవైపు..ఇలా అనేక సమస్యలు ఉండగానే పరిష్కారాలు ప్రకటించకుండా బ్యాంకింగ్ రెగ్యులేటరీ విలీనం అమలు ఆగదని స్పష్టం చేస్తోంది.

దేశవ్యాప్తంగా బ్యాంకుల విలీనానికి ఎలాంటి అడ్డంకుల్లేవని ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల విలీనం అమల్లోకి వస్తుందని బ్యాంకింగ్ రెగ్యులేటరీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగాన్ని పటిష్ఠపరిచే ప్రణాళికలో భాగంగా పది ప్రభుత్వ బ్యాంకులను నాలుగు అతిపెద్ద బ్యాంకులుగా మార్చే ప్రణాళికను కేంద్ర మొదలుపెట్టింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ అమలు కారణంగా విలీన ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతూ బ్యాంక్ సంఘాలు ప్రధానమంత్రికి లేఖ రాశాయి. అయితే, మెగా బ్యాంక్ కన్సాలిడేషన్ ప్లాన్ పూర్తీ కావస్తోందని కరోనా మహమ్మారిని వ్యాపించినప్పటికీ ఏప్రిల్ 1 నుంచి అమ్మలోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

విలీనం ప్రకారం..ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం అవుతాయి. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంకులోకి, అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంకులోకి, ఆంద్రా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంకులోకి విలీనం చేయబడతాయి.

ఏప్రిల్ 1 నుంచి విలీనం అయిన బ్యాంకుల డిపాజిటర్లతో సహా వినియోగదారులందరూ విలీనం చేసుకున్న బ్యాంకు వినియోగదారులుగా పరిగణించబడతారని ఆర్‌బీఐ వెల్లడించింది. అయితే, మార్చి 25న ప్రధానికి రాసిన లేఖలో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫడరేషన్..అంటువ్యాధి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి అనేక చర్యలను ప్రకటించారు. బ్యాంకుల విలీన ప్రక్రియ విషయంలో కూడా తగిన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జూన్ 30 వరకూ వాయిదా వేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పింది.

Tags : Bank Merger Date, Bank Merger Deadline, Bank Merger April 1, When Is Bank Merger Final Date, Bank Merger, United Bank Of India, Oriental Bank Of Commerce, Punjab National Bank, Second Largest Public Sector Bank

Advertisement

Next Story