Mobikwik, Spice Moneyపై RBI భారీ జరిమానా.. ఎందుకో తెలుసా..?

by Harish |
rbi
X

దిశ, వెబ్‌డెస్క్: రెగ్యులేటరీ మార్గదర్శకాలను పాటించనందుకు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు One Mobikwik Systems Private Ltd, Spice Money Ltd.పై చేరో కోటి రూపాయల జరిమానా విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గురువారం తెలిపింది. భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ల(BBPOUs) కోసం జారీ చేసిన ఆదేశాలను ఈ రెండు సంస్థలు పాటించలేదని RBI తెలిపింది. PSS చట్టంలోని సెక్షన్ 30లోని నిబంధనల ప్రకారం RBIకి ఉన్న అధికారాలను ఉపయోగించి జరిమానాలు విధించింది. ఇంతకు ముందు RBI ఈ రెండు సంస్థలు నుంచి రాతపూర్వక స్పందనలు కోరింది. వ్యక్తిగత విచారణ తర్వాత RBI ఈ ఫిన్‌టెక్ కంపెనీలకు భారీ జరిమానా విధించింది. ఇదిలా ఉండగా రెగ్యులేటరీ మార్గదర్శకాలను పాటించనందుకు 2019లో కూడా Mobikwik పై RBI రూ.15 లక్షల జరిమానా విధించింది.

Advertisement

Next Story