పరిమితి దాటిన ఏటీఎం లావాదేవీలపై రుసుము పెంచిన ఆర్‌బీఐ

by Harish |   ( Updated:2021-06-10 11:26:02.0  )
RBI hikes ATM interchange fee per transaction
X

దిశ, వెబ్‌డెస్క్: ఏటీఎంలో లావాదేవీలు ఇకపై మరింత భారం కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఏటీఎంల నుంచి పరిమితి దాటిన తర్వాత జరిపే ప్రతి లావాదేవీకి ఇంటర్‌ఛేంజ్ రుసుమును ఆర్థిక లావాదేవీలకు రూ. 15 నుంచి రూ. 17కు, ఆర్థికేతర లావాదేవీలకు రూ. 5 నుంచి రూ. 6కు పెంచుతున్నట్టు గురువారం వెల్లడించింది. పెంచిన రుసుములు ఆగష్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. ‘కమిటీ సిఫార్సులను సమగ్రంగా పరిశీలించాం. ఏటీఎం లావాదేవీల కోసం ఇంటర్‌ఛేంజ్ రుసుములకు సంబంధించి స్ట్రక్చర్ మార్పులు చివరిసారిగా 202లో జరిగింది.

వినియోగదారులు చెల్లించాల్సిన ఛార్జీలు చివరిగా 2014, ఆగస్టులో సవరించబడ్డాయి. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి మార్పులు చేస్తున్నట్టు’ ఆర్‌బీఐ ఓ ప్రకటనలో వివరించింది. ఈ పెంపు నగదు డిపాజిట్ చేసే లావాదేవీలు కాకుండా అన్నిటికీ వర్తిస్తాయని ఆర్‌బీఐ పేర్కొంది. దీంతో ఆగష్టు 1 నుంచి వినియోగదారులు బ్యాంకు ఏటీఎంల నుంచి చేసే లావాదేవీల్లో ఐదు ఉచిత లావాదేవీల తర్వాత ఈ ఛార్జీలకు రుసుములను చెల్లించక తప్పదు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మెట్రో ప్రాంతాల్లో మూడు లావాదేవీలు, మెట్రోయేతర ప్రాంతాల్లో ఐదు లావాదేవీల వరకు ఉచితమని ఆర్‌బీఐ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed