నగదు విత్‌డ్రా చేసేవారికి షాకింగ్ న్యూస్..!

by Harish |   ( Updated:2020-06-23 03:46:07.0  )
RBI hikes ATM interchange fee per transaction
X

దిశ, సెంట్రల్ డెస్క్: ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసే వారికి త్వరలో ఆర్‌బీఐ షాక్ ఇవ్వనుంది. రూ. 5 వేల కంటే ఎక్కువ నగదును ఏటీఎం నుంచి తీసేవారి నుంచి ఛార్జీలను వసూలు చేయాలని ఆర్‌బీఐ నియమించిన కమిటీ సిఫార్సు చేసింది. కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అదనపు ఛార్జీలతో సహా ఇటీవల పలు కీలక సంస్కరణలను కమిటీ ప్రతిపాదించింది. ఏటీఎంలలో జరిపే అన్ని లావాదేవీలపై ఇంటర్ ఛేంజ్ ఛార్జీలను పెంచేలా కమిటీ సూచించినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఏటీఎంలకు ఇది వర్తించేలా ఉండాలని తెలిపింది. ఈ కమిటీ విషయం అందరికీ అందుబాటులో లేదుకానీ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ సమాచారాన్ని సంపాదించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, 10 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో 24 శాతం ఏటీఎం ఛార్జీలను పెంచాలని నివేదిక అందజేశారు. ఈ నివేదికను బ్యాంకుల అత్యున్నత స్థాయి అధికారులు పరిశీలిస్తున్నారు. ఒకవేల ఆర్‌బీఐ కమిటీ నివేదిక అమలుకు సిద్ధమైతే ఏటీఎం వినియోగదారులకు ఛార్జీల మోత తప్పదని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed