2022 రవితేజదే!.. వరుస సినిమాలతో దద్దరిల్లనున్న థియేటర్లు 

by Shyam |
Raviteja
X

దిశ, సినిమా: ‘క్రాక్’ ఇచ్చిన బ్లాక్ బస్టర్‌తో స్పీడు పెంచారు మాస్ మహరాజా రవితేజ. వరుస మూవీస్‌ ప్రకటించిన ఆయన .. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఎస్ఎల్‌వీ సినిమాస్, ఆర్.టీ.టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన నటించిన ‘ఖిలాడీ’ ఫిబ్రవరి 11న విడుదలకు సిద్ధం కాగా 44 రోజుల గ్యాప్‌తో ‘రామారావు ఆన్ డ్యూటీ’ వచ్చేస్తోంది.

దీంతో ఖుష్ అవుతున్న ఫ్యాన్స్.. ‘2022 లో మా అన్న రవితేజ సినిమాలతో థియేటర్లు అన్ని దద్దరిల్లి పోవాల్సిందే ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ‘ధమాకా’ ‘రావణాసుర’ ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే రవితేజ మూవీస్ వచ్చే ఏడాదే విడుదల కాబోతుండటం విశేషం. మరి 2022‌లో రవితేజకు ఏ రేంజ్‌లో అదృష్టం కలిసొస్తుందో చూడాలి.

Advertisement

Next Story