- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీ20 జట్టుకు కాబోయే కెప్టెన్ అతనే.. కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్ : టీ20 జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ నుంచి టీమిండియా సూపర్ 12 దశలో వెనుదిరిగింది. అయితే ఈనెలలో న్యూజిలాండ్ జట్టుతో టీ20 సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు కొత్త కెప్టెన్ రానున్నాడు. అయితే కెప్టెన్ ఎవరా అనే విషయంపై ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. కానీ, కెప్టెన్‌గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకే చాన్స్ ఉందంటూ భారత క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా టీమిండియా టీ20 జట్టుకు కాబోయే కెప్టెన్ రోహిత్ శర్మనే అంటూ హెడ్ కోచ్ రవిశాస్త్రి కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ.. రోహిత్ శర్మనే జట్టుకు కెప్టెన్ అవుతాడు. టీ20ల్లో హిట్ మ్యాన్‌కు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ ఐదుసార్లు కప్‌ను అందించాడని పేర్కొన్నాడు. ఈ సందర్భంగానే భారత క్రికెటర్లు తీరికలేని క్రికెట్ ఆడటంతో పాటు మానసికంగా అలిసిపోయారని అన్నారు. ముందు టీమిండియా క్రికెటర్లకు విశ్రాంతి అవసరమని బీసీసీఐని కోరాడు.