- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ హీరోయిన్‌తో Salman Khan గొడవ.. కారణం ఇదే?
దిశ, సినిమా: బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ర్టీలోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రవీనా టాండన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ గురించి ఆసక్తికరమైన విషయం వెల్లడించింది. 1991లో తెరకెక్కిన ‘పత్తర్ కే పూల్’ సినిమాతో రవీనా తెరంగేట్రం చేయగా.. షూటింగ్ సమయంలో సల్మాన్ తను ప్రతీ చిన్న విషయానికి గొడవ పడుతూ ఉండేవారని తెలిపింది. ఓ సారి గొడవ తారాస్థాయికి చేరడంతో ఇక ఎప్పటికీ రవీనాతో పనిచేయనని సల్మాన్ మూవీ యూనిట్‌కు చెప్పినట్లు గుర్తుచేసుకున్న నటి.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసింది.
‘మొదటి సినిమా సమయానికి నాకు 16 ఏళ్లు, సల్మాన్‌కు 23 ఏళ్లు.. అయినా సినిమా షూటింగ్ సమయంలో చిన్న పిల్లల్లా ప్రతీ విషయంలో వాదించుకునే వాళ్లం. మా ఇద్దరి మధ్య అంత చనువుకు కారణం సల్మాన్ తండ్రి సలీమ్, మా నాన్న మంచి స్నేహితులు. కాబట్టి సల్మాన్ నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. అప్పటి నుంచే మాకు పడేది కాదు. ఇంటి దగ్గర గొడవలనే సెట్స్ పైకి కూడా తీసుకెళ్లే వాళ్లం. దాంతో ఇక ఎప్పటికీ నాతో కలిసి పని చేయకూడదని సల్మాన్ అనుకున్నాడు. కానీ మా కాంబినేషన్‌లోనే వచ్చిన ‘అందాజ్ అప్నా అప్నా’ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది’ అని సల్మాన్‌తో తనకున్న అనుబంధం గురించి రవీనా వివరించింది.