సౌత్ ఇండస్ట్రీపై రవీనా టాండన్ పొగడ్తల వర్షం

by Jakkula Samataha |
raveena tandon kgf 2
X

దిశ, సినిమా : సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ సౌత్ ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపించింది. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో కీ రోల్ ప్లే చేస్తున్న ఆమె.. ఇంతకుముందు కూడా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో నటించారు. కాగా దక్షిణభారత చిత్రపరిశ్రమలో పనిచేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపింది. సౌత్ కంటెంట్ రిచ్‌గా ఉంటుందని, టెక్నికల్లీ ది బెస్ట్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది.

కన్నడ ఇండస్ట్రీలో మరింత వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ ఉందని, పాన్ ఇండియా సినిమా ద్వారా ఎక్కువమంది ఆడియన్స్‌ను రీచ్ కావడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అని తెలిపింది. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పొలిటీషియన్ రమికా సేన్‌గా కనిపించబోతున్నట్లు తెలిపిన రవీన.. గ్రే షేడ్స్ ఉన్న పాత్ర చేసేందుకు నటిగా సిగ్గుపడట్లేదన్నారు. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నానని, ఓటీటీలో ఇందుకు ఎక్కువ అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. కాగా ‘అరణ్యక్’ ద్వారా వెబ్ వరల్డ్‌లోకి కూడా అడుగుపెట్టబోతోంది రవీన.

Advertisement

Next Story