బాలీవుడ్ డ్రగ్ మాఫియాపై రవీనా

by Jakkula Samataha |
బాలీవుడ్ డ్రగ్ మాఫియాపై రవీనా
X

దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ కేసు దర్యాప్తు.. డ్రగ్స్ యాంగిల్‌కు దారి తీసిన విషయం తెలిసిందే. రియా చక్రవర్తి డ్రగ్ డీలర్స్‌తో మాట్లాడినట్లు ఆధారాలు లభించడంతో ఎన్‌సీబీ అధికారులు తనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్, నమ్రత శిరోద్కర్, దీపికా పదుకొనే లాంటి హీరోయిన్ల పేర్లు కూడా బయటకి వచ్చాయి. కానీ ఇదెంతవరకు నిజమో ఇంకా తెలియలేదు.

అయితే, బాలీవుడ్‌లో డ్రగ్ మాఫియా గురించి ఇప్పటికే కంగనా రనౌత్ బహిరంగంగా మాట్లాడింది. ప్రతీ ఒక్కరినీ బయటకు తీసుకువస్తానని.. కానీ తనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరింది. ముంబై పోలీసులను నమ్మలేనని తెలిపింది. ఆ తర్వాత ఈ విషయం కంగనా, మహారాష్ట్ర సర్కార్ వార్‌కు దారి తీయగా ఇంకా ఆ గొడవ కంటిన్యూ అవుతోంది.

కాగా, డ్రగ్ మాఫియా విషయంలో హీరోయిన్ రవీనా టాండన్ ఓపెన్‌గా మాట్లాడింది. ‘శుభ్రం చేయడానికి ఇదే మంచి సమయం’ అని అభిప్రాయపడింది. ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నానని తెలిపిన ఆమె.. తద్వారా భవిష్యత్ తరాలకు సహాయం చేసినట్లు అవుతుందని చెప్పింది. ఇక్కడ నుంచి ప్రారంభించి అన్ని రంగాల్లోనూ పేరుకుపోతున్న డ్రగ్ మాఫియాను అంతం చేయాలని కోరింది. ప్రధాన భాగం నుంచే తుంచి వేయాలని.. అపరాధులు, డ్రగ్స్ వినియోగ దారులు, డ్రగ్ సప్లయర్స్ అందరికీ శిక్ష పడాలని కోరింది.

Advertisement

Next Story