- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ఘనంగా రావణ దహనం..
దిశ, వెబ్‌డెస్క్ : దసరా పండుగను తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఊరూరా, వాడవాడల్లో జమ్మి చెట్టుకు షమీ పూజలు నిర్వహించిన అనంతరం జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చుకుని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇకపోతే చిన్నాపెద్ద అందరూ కొత్త బట్టలు ధరించి దేవుని ఆశీస్సులతో పాటు కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహించుకునే తొలి పండుగ కావడంతో సొంతూర్లకు చేరుకున్న చిన్ననాటి మిత్రులతో కలిసి పల్లె, పట్నం జనం ఘనంగా విజయదశమి వేడుకలను జరుపుకున్నట్టు తెలుస్తోంది.
ఇకపోతే వాడవాడలా, గల్లీల్లో, ఊరూరా రావణాసురుడి విగ్రహాలను ఏర్పాటు చేసి దహనం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రావణాసురుడి ప్రతిమల దహన కార్యక్రమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాటిని చూసేందుకు ప్రజలంతా దహన కార్యక్రమం జరిగే ప్రదేశానికి తరలుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల బాణాసంచా కాల్చి ప్రజలు ఘనంగా దసరా వేడుకలు జరుపుకున్నట్టు సమాచారం. కాగా, హైదరాబాద్‌లోని అంబర్ పేట్‌లో జరిగిన దసరా వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నట్టు తెలిసింది.