‘రావణలంక’ ఆడియో లాంచ్

దిశ, వెబ్‌డెస్క్: క్రిష్, అశ్విత, త్రిష హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రావణలంక. కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్‌పై క్రిష్ నిర్మించిన సినిమాకు బిఎన్ఎస్ రాజు దర్శకత్వం వహించారు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో లాంచ్ శుక్రవారం ఘనంగా జరిగింది. డైరెక్టర్ వీర శంకర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, మూవీ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రావణలంక హీరో, నిర్మాత మాట్లాడుతూ సినిమా కోసం చాలా కష్టపడ్డానని, వేరే నిర్మాత సినిమాను నిర్మిస్తే బడ్జెట్ సమస్యలు వస్తాయనే తాను ప్రొడ్యూస్ చేసినట్లు తెలిపారు. ప్రతీ టెక్నిషియన్ మూవీ కోసం హార్డ్ వర్క్ చేశారన్న ఆయన..డైరెక్టర్ కష్టానికి ప్రతిఫలం తెరమీద చూస్తారని చెప్పారు. సినిమా దర్శకులు బిఎన్ఎస్ రాజు మాట్లాడుతూ బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మూవీ తీశామని, ఇందుకు హీరో, నిర్మాత క్రిష్‌కు ధన్యవాదాలు అని తెలిపారు. హిమాలయాలు, బ్యాంకాక్, వైజాగ్‌లోని అందమైన లొకేషన్లలో షూటింగ్ జరిగినట్లు తెలిపిన దర్శకులు..తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే ధీమా వ్యక్తం చేశారు.

డైరెక్టర్ వీర శంకర్ మాట్లాడుతూ హీరో క్రిష్ ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడని అన్నారు. తనతో క్రిష్ ఇంతకుముందే సాంగ్స్, విజువల్స్ గురించి చర్చించాడని..తను చెప్పినట్లుగానే చాలా బాగున్నాయని చెప్పాడు. సినిమాలో సృజన పాట పాపులర్ అవుతుందన్నారు. థియేటర్స్‌లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

Advertisement