తిరుపతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ..?

by srinivas |   ( Updated:2021-03-25 06:16:39.0  )
ratnaprabha bjp
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఉపఎన్నికను అటు వైసీపీ, టీడీపీ, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత వారం షెడ్యూలును ప్రకటించగా.. మార్చి 24 నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీలు తమ అభ్యర్థులను ప్రకటించేశారు. వీరిలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి.. బుధవారం నామినేషన్ కూడా వేశారు. ఈనెల 29న వైసీపీ అభ్యర్థి డా.గురుమూర్తి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే గురువారం బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించనుంది.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి కె.రత్నప్రభ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో అధికారికంగా బీజేపీ ప్రకటించనుంది. ఇకపోతే రత్నప్రభ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కాగా ఆమె 1981 బ్యాచ్‌ కర్నాటక కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. కన్నడ ప్రభుత్వంలో ఆమె పలు హోదాలలో పని చేశారు. 2018 జూన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీవిరమణ చేశారు. అనంతరం 2019లో ఆమె బీజేపీలో చేరారు. ఆమె భర్త ఎ.విద్యాసాగర్‌ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి. రత్నప్రభ కూడా కొన్నాళ్లు డిప్యూటేషన్‌పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వంపై బీజేపీ అధిష్టానం మొగ్గు చూపిందని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed