- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ద్రవ్యోల్బణం ఆధారంగా రేట్ల తగ్గింపు’
దిశ, వెబ్‌డెస్క్: త్వరలో రేట్ల తగ్గింపునకు అవకాశముందని, అయితే, ఇది ద్రవ్యోల్బణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని, ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) పరిధికి మించి ద్రవ్యోల్బణం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ‘ద్రవ్యోల్బణం మా అంచనాలకు మించి ఉంది. త్వరలో తాము నిర్దేశించిన స్థాయిలో రాగలిగితే భవిష్యత్తులో రేట్ల కోతకు అవకాశముంటుందని, వృద్ధిని పునరుద్ధరించేందుకు రేట్ల కోట తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. రిటైల్ ద్రవ్యోల్బణం అధికంగా ఉండటంతో ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగిన ద్రవ్య విధాన కమిటీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు సంకోచించగా, రెండో త్రైమాసికంలో సానుకూల పరిస్థితులు వరుస త్రైమాసికంలో అభివృద్ధిని సూచిస్తున్నాయని దాస్ తెలిపారు. అయితే, ప్రస్తుత రికవరీ పరిస్థితుల్లో అనిశ్చితి ఉంది. ప్రధానంగా కొవిడ్-19 సెకండ్ వేవ్ ప్రమదం కూడా ఉంది.