'జనరిక్ ఆధార్' యాప్‌ను విడుదల చేసిన రతన్ టాటా!

by Harish |
Ratan Tata
X

దిశ, వెబ్‌డెస్క్: రతన్ టాటా నిధులను అందిస్తున్న ఔషధ స్టార్టప్ కంపెనీ జనరిక్ ఆధార్ యాప్‌ను సోమవారం విడుదల చేశారు. ఆన్‌లైన్ ఫార్మసీలో పోటీని అధిగమించేందుకు దీన్ని ప్రారంభించారు. ఈ యాప్‌లో మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లను అప్‌లోడ్ చేసేందుకు, ఆర్డర్లను ఇచ్చే సదుపాయాలు ఉన్నాయి. సంబంధిత మందులు సమీప జనరిక్ ఆధార్ ఫ్రాంచైజీ స్టోర్ నుంచి పంపిణీ చేయనున్నారు. ‘జనరిక్ ఆధార్’ మొబైల్ యాప్ దేశీయంగా స్వతంత్ర రిటైల్ దుకాణాలు ఆన్‌లైన్ ఫార్మసీల నుంచి పోటీని ఎదుర్కొనేందుకు సహాయపడనుంది. వినియోగదారులు సమీప ప్రాంతాల నుంచి తక్కువ సమయంలో మందులను డెలివరీ పొందవచ్చని జనరిక్ ఆధార్ వ్యవస్థాపకుడు 18 ఏళ్ల అర్జున్ దేశ్‌పాండే చెప్పారు. ‘ప్రజలు చేరువ కావడానికి జనరిక్ ఆధార్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే, దేశీయంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాన్ని పెంపోందించేందుకు ఇది తోడ్పాటునందిస్తుంది. ప్రజలకు సేవ చేయాలనే తమ కోరికకు మరింత బాధ్యత సంతరించుకుంది. ప్రజలకు సరసమైన ధరలకే నాణ్యమైన మందులను అందించనున్నామని’ రతన్ టాటా అన్నారు.

Advertisement

Next Story

Most Viewed