- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రష్మిక ఇక్కడ తగ్గినా.. అక్కడ మాత్రం తగ్గలే!
దిశ, సినిమా: కన్నడ అందం రష్మిక మందాన త్వరలోనే ‘మిషన్ మజ్ను’ మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అవుతుండటంతో ఇటీవలే ముంబై చేరిన ఈ భామ.. తను, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన తెలుగు ఫిల్మ్ ‘డియర్ కామ్రేడ్’ హిందీ డబ్బింగ్ 250 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం పట్ల స్పందించింది. ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదన్న లిల్లీ.. నేటికి కూడా డియర్ కామ్రేడ్‌కు తన గుండెలో ప్రత్యేక స్థానం ఉందని వెల్లడించింది. మూవీ కోసం ప్రిపరేషన్, జనాలు, షూటింగ్ ప్రాసెస్, ఎక్స్‌పీరియన్స్.. సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం చాలా స్పెషల్ అని చెప్పింది. ఆ ఫీలింగ్స్‌ను మాటల్లో చెప్పలేనని తెలిపింది. యూట్యూబ్‌లో 250 మిలియన్ వ్యూస్ దక్కడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని, ఎందుకంటే ఈ సినిమాకు ఆ అర్హత ఉందని పేర్కొంది. అయితే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ‘డియర్ కామ్రేడ్’పై ప్రేమ కురింపించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. కాగా భరత్ కమ్మ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా తెలుగులో ఆశించిన ఫలితం సాధించలేకపోయింది.