రష్మిక బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు భారీ రెమ్యునరేషన్

by Shyam |   ( Updated:2020-12-31 02:20:04.0  )
రష్మిక బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు భారీ రెమ్యునరేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: క్యూట్ రష్మిక మందన ‘మిషన్ మజ్ను’తో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయిందో లేదో అప్పుడే సెకండ్ ప్రాజెక్ట్‌కు కూడా సైన్ చేసేసింది. అంతేకాదు ఏకంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తోనే స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ కొట్టేసింది లిల్లీ. వికాస్ బాల్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో ముందుగా కత్రినా కైఫ్, కృతి సనన్‌ను తీసుకున్నా.. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఇద్దరు కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ అదృష్టం కాస్త రష్మికను వరించింది. నిర్మాత ఏక్తా కపూర్ రష్మిక క్యూట్‌నెస్, యాక్టింగ్ స్కిల్స్‌కు ఫిదా కాగా.. తన డిమాండ్ మేరకు రూ. 6 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు అంగీకరించారని తెలుస్తోంది. మొత్తానికి రష్మిక రెండో సినిమాకే భారీ రెమ్యునరేషన్ అందుకుంటుండగా.. ‘డెడ్లీ’ టైటిల్‌తో వస్తున్న సినిమాలో బిగ్ బీ, రష్మిక తండ్రీకూతుళ్లుగా నటించనున్నారు. కాగా మార్చి 2021లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Advertisement

Next Story