- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashmika Mandanna: మహా సముద్రం ఫస్ట్ సింగిల్ రిలీజ్.. లిరికల్‌పై రష్మిక కూల్ కామెంట్
దిశ, సినిమా : శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్యాన్యుయేల్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన చిత్రం ‘మహా సముద్రం’. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుంచి ఈరోజు(సోమవారం) ఫస్ట్ సింగిల్ రిలీజైంది. సోషల్ మీడియా అకౌంట్‌లో లిరికల్ వీడియోను షేర్ చేసిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. టీజర్ గురించి కూడా హింట్ ఇచ్చింది.
‘చెప్పకే చెప్పకే’ అంటూ సాగే పాట చాలా కూల్‌గా ఉందంటూ మెచ్చుకుంది. ఇక యాక్టర్ శర్వానంద్ తనకు ట్రైలర్ కట్ చూపించాడని చెప్పిన రష్మిక.. అందరూ పర్ఫార్మెన్సెస్‌తో అదరగొట్టారని వెల్లడించింది. కాగా తన పోస్టుకు ప్రొడ్యూసర్ అనిల్ సుంకర రిప్లయ్ ఇచ్చారు. ప్రజెంట్ మూవీలోని ఇష్టమైన పాటను తమ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిలేరు నీకెవర్వరు’లో హీరోయిన్‌గా నటించిన రష్మిక విడుదల చేయడం శుభసూచకమని తెలిపారు.
Such a sweet song. All the best you guys! 🌸😙 Happy to launch #CheppakeCheppake 😁 @ImSharwanand 🌸 also showed me the trailer-cut and got to say @Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel you guys look amaaaazing!! ❤️ Loads of love.. 🌸#MahaSamudram 🌊 pic.twitter.com/LWuouS0j1m
— Rashmika Mandanna (@iamRashmika) September 6, 2021
ఇక ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించగా.. ప్రస్తుతం రిలీజ్ చేసిన పాటకు చైత్యన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. దీప్తి పార్థసారధి ఆలపించిన మెలోడి సాంగ్‌ను శర్వా, అదితిపై చిత్రీకరించారు. జగపతి బాబు, రావు రమేష్, గరుడ రామ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘మహా సముద్రం’ అక్టోబర్ 14న రిలీజ్ కానుంది.