రష్మిక ‘మిషన్ మజ్ను’ షురూ

by Shyam |   ( Updated:2021-02-06 06:46:06.0  )
రష్మిక ‘మిషన్ మజ్ను’ షురూ
X

దిశ, సినిమా: క్యూట్ బ్యూటీ రష్మిక మందన ఫస్ట్ బాలీవుడ్ మూవీ ‘మిషన్ మజ్ను’ షూటింగ్ లక్నోలో ప్రారంభమైనట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇండియాస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్ఎస్‌వీపీ మూవీస్, గిల్టీ బై అసోసియేషన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రా లీడ్ రోల్ పోషిస్తున్న ఈ మూవీకి శంతను బాగ్చి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా1970ల నాటి యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో తనను ఫిమేల్ లీడ్‌గా సెలెక్ట్ చేసిన మూవీ యూనిట్‌కు రష్మిక థాంక్స్ చెప్పింది. నటిగా తాను అందరికీ చేరువయ్యే మూవీ ఇదని పేర్కొంది. బాలీవుడ్‌లో కొత్త ప్రేక్షకులను పొందబోతున్నందకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించింది.

Advertisement

Next Story