పెట్స్‌తో ముచ్చటించిన రష్మిక

by Shyam |
పెట్స్‌తో ముచ్చటించిన రష్మిక
X

క్యూట్ హీరోయిన్ రష్మిక మందన లాక్ డౌన్‌లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో తన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఈ మధ్య బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న శారీలో కూర్చున్న పిక్‌ను షేర్ చేసి అందుకు అనుగుణంగా పార్ట్‌లు పార్ట్‌లు గా ఓ స్టోరీ చెప్పిన భామ..ఇప్పుడు తన పెట్స్‌తో కలిసి ప్రకృతిని ఎంత ఎంజాయ్ చేస్తుందో తెలుపుతూ క్యూట్ పిక్స్ షేర్ చేసింది.

ఆవుతో కలిసి దిగిన ఫొటో అభిమానులతో పంచుకున్న మందన..చాలా రోజుల తర్వాత తనను కలిశాను అని..ఇప్పుడు తన సీక్రెట్స్ అన్నీ చెప్తుందని తెలిపింది. ఇక తన పెట్ డాగ్ తన మీదకు ఎప్పుడూ జంప్ చేయడమే పనిగా పెట్టుకుందంటూ అందుకు సంబంధించిన పిక్చర్ కూడా పెట్టింది. తన చెల్లిని లిటిల్ మంకీ‌గా చెప్పిన రష్మిక..తన పని కూడా అదేనని చెప్తుంది. కోడి, కోడి పిల్లతోనూ ముచ్చటించిన భామ.. పెంపుడు జంతువులతో స్పెండ్ చేయడం చాలా ఆనందంగా ఉందని అంటుంది.

Advertisement

Next Story