- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసివస్తుంది
మేష రాశి : ఈ రాశివారిని నేడు ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతాయి. ఈరోజు తమకు తెలియకుండానే ఎక్కడో ఒక చోట అతిగా ఖర్చు చేస్తారు. మీ అశ్రద్ధ వలన వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. వీరు ఈరోజు ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఆసక్తిచూపుతారు. మీరు ఈరోజు ఆఫీసులో ఓ అద్భుతమైన వ్యక్తినికి కలుసుకోవడం జరుగుతుంది. అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
వృషభ రాశి : ఈరోజు ఈ రాశివారు దూరపు బంధువుల నుంచి అనుకోని శుభ వార్త వింటారు. ఇది మీ కుటుంబాన్ని చాలా సంతోషంలో ముంచెత్తుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. భాగస్వాములు, ఉమ్మడి వ్యాపారాలకు దూరంగా ఉండటం మంచిది. వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబంలోని కొన్ని రకాల సమస్యలు టెన్షన్‌కు గురి చేస్తాయి. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.
మిథున రాశి : ఈరాశిలోఉన్న వివాహము అయినవారికి వారియొక్క అత్తామావయ్యలనుండి ఆర్ధికప్రయోజనాలను పొందుతారు. మీ కుటుంబంతో కొంత సమస్యలున్నాయి, కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. మీరు అనవసర వాగ్వివాదాలకు సమయమును వృధాచేస్తారు.రోజుచివర్లో ఇదిమీయొక్క విచారానికి కారణము అవుతుంది.
కర్కాటక రాశి : ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు.మీరు ఎవరికైనా అప్పు ఇచ్చివుంటే మీరు వారినుండి ఈరోజు మీధన్నాన్ని తిరిగి పొందగలరు. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు వచ్చి చేరుతాయి. దీంతో వారు ఈరోజు మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు.మీ వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఆర్థికంగా బాగుంటుంది.
సింహ రాశి : గతంలో పెట్టిన పెట్టుటబడుల నుంచి లాభం రావడంతో చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారం పరంగా కొత్త ప్రణాళికలు రచిస్తారు. ప్రతి సమస్యను పరిష్కరించుకోగలరు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త. ఈ రాశి వారు నేడు అనుకోని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి లాభదాయకంగా మారుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
కన్యా రాశి : ఈ రాశి వారు నేడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. గతంలో ఇచ్చిన డబ్బులు చేతిక రాక చాలా ఇబ్బంది పడుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం జరుగుతుంది. మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించడం మిమ్ముల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. స్నేహితులు, బంధువుల సహాయం లభిస్తుంది. వ్యాపారస్తులకు కలసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
తుల రాశి : మీకు పనులు చేసుకోవడానికి, మీ ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరచుకోవడానికి సరిపడ సమయం దొరుకుతుంది. ఆర్థికపరంగా మీకుమిశ్రమంగా ఉంటుంది.మీరు ధనార్జన చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ప్రవర్తించడం మీ మనస్సును గాయపరుస్తుంది. ఈరోజు ఈ రాశులోని కళాకారులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఎన్నో కొత్త అవకాశాలు వస్తుంటాయి.
వృశ్చిక రాశి : రోజు మదుపు చెయ్యడం మానాలి. కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం, ఆందోళనలకు కారణం కావచ్చును. మీరుండే చోటుకి మీ పైఅధికారిని, మరియు సీనియర్లని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు.ఈరోజు అనవసరమైన పనులు మళ్లీమళ్లీచేయుటవలన మీరు సమయాన్నివృధాచేస్తారు. ఆఫీసులో ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
ధనస్సు రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మిత్రులు, కుటుంబసభ్యుల సహాయ సహకారాలతో ఆర్థికసమస్యలన్నీ తీరిపోతాయి. ఎవరైతే పోటీ పరీక్షలకోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈరోజు విజయం వరించే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. మొండి బాకీలు వసూలు కావడం సంతోషాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు.
మకర రాశి : వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
కుంభ రాశి : ఈరాశి వారికి ఈరోజు అందే ఓ శుభవార్త సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు మీ కుటుంబ సమస్యలను ఇతరులకు తెలియజేయడం వలన మీరు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఆర్థఇకంగా బాగుంటుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి రుణప్రయత్నం చేస్తారో వారికి రుణం లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
మీన రాశి :ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీపై వ్యతిరేఖ భావాలు ఉన్నవారికి దూరంగా ఉండటం మంచిది. ఈరోజంతా ఆర్థికసమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, చివర్లో మీరు లాభాలను చవిచూస్తారు. నేడు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
- Tags
- Today